Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

boondi Laddu recipe_chitrannam

laddu_recipe_telugu_satyasfoods
Laddu recipe in telugu
బూందీ లడ్డు 
విజయ దశమి పండుగరోజు అమ్మవారి నైవేద్యం గ బూందీ లడ్డు, చిత్రాన్నం ప్రసాదం గ సమర్పిస్తారు. ఈ లడ్డు ను బెల్లం తో మాత్రమే చెయ్యాలి. ప్రసాదం గ పంచదార కన్నా బెల్లం శ్రేష్టం. 
కావలసిన పదార్ధాలు :
సెనగపిండి                   1 కప్ 
బెల్లం                                 1 కప్ 
నూనె లేదా నెయ్యి          వేయించటానికి 
యాలకుల పొడి , పచ్చకర్పూరం చిటికెడు, జీడిపప్పు, కిస్మిస్ . 
తయారు చేసే విధానం  :
1. సెనగపిండిని జల్లించుకొని, నీళ్లతో ఉండలు లేకుండా కలపాలి. ఇది మరి పలచగాను, మరి గట్టిగ కాకుండా గరిట జరుగ తయారు చేసుకోవాలి. 
2. బెల్లం తీగ పాకం వచ్చేవరకు మరగబెట్టి పక్కన పెట్టాలి. 
3. ఇప్పుడు నూనె వేడిచేసి బూందీ చట్రం లో సెనగపిండి వేస్తూ బూందీ వేపాలి. 
4. బూందీ వేగాక వేడిగానే పాకంలో వేసి జీడిపప్పు , కిస్మిస్ వేయించి అందులోవెయ్యాలి, అలాగే పచ్చ కర్పూరం, యాలకుల పొడి కూడా వేసి వేడి మీదనే బూందీ లను చుట్టుకోవాలి. 
కావలసిన పదార్ధాలు : 
ఉడికించి అన్నం         2 కప్
నిమ్మరసం                     1 కప్ 
పోపు దినుసులు , ఉప్పు, పసుపు , జీడిపప్పు 
పొడి కోసం :
మెంతులు                 1/2 స్పూన్ 
ఆవాలు                       1/2 స్పూన్ 
మినప్పప్పు                 1 స్పూన్ 
ఎండు మిర్చి                4
 తయారు చేసే విధానం  :
1. బియ్యాన్ని ఉప్పు వేసి ఉడికించి పెట్టాలి , పైన చెప్పిన పొడి దినుసులు వేయించి పొడి కొట్టు కోవాలి .2. ఇప్పుడు ఒక మూకుడు లో నూనె వేసి జీడిపప్పు వేయించి పక్కనపెట్టాలి . అందులో పోపు దినుసులు  పల్లీలు , మినప్పప్పు , సెనగపప్పు , ఆవాలు , ఎండు మిర్చి , పచ్చి మిర్చి, అల్లం తురుము, జీలకర్ర , ఇంగువ , పసుపు కరివేపాకు వేసి వేయించాలి. 
3. వేగాక అన్నం ను ఇందులో వేసి పొడి కూడా వేసి కలపాలి. 
అన్నం లో పొడి బాగా కలిసాక. జీడిపప్పు పైన వేసి కలపాలి. 
చిత్రాన్నం ప్రసాదం రెడీ. 
 Youtube link 
Thank you 




 

Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...