Skip to main content

నారింజ తొనల కారం పాతకాలం పద్దతిలో|Narinja karam| Orange chutney|Narinja ...

Boorelu recipe_Poornam boorelu

పోలి  బూరెలు -పూర్ణం బూరెలు 

burelu recipe, purnam burelu, poli burelu 
 బూరెలు సాంప్రదాయ వంటకం. అన్ని పండుగలు, శుభకార్యాలలో ప్రధాన వంటకం. ఇవి  రెండు రకాలుగా చేయవచ్చు. పోలి  బూరెలు, పూర్ణం బూరెలు. 

బూరెల తోపు :   
  మినప్పప్పు    :   1 కప్ 
  బియ్యం           :   2 1/2 కప్ 
  మెంతులు        : 1 స్పూన్ 
   సెనగపప్పు     :  1 స్పూన్ 
    పైన పదార్ధాలన్నీ ఒక రాత్రి నానబెట్టాలి .  నానిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి . 
  రుబ్బిన ఈ తోపు పిండిని 2 గంటలు నానబెట్టాలి . 
పోలి బూరెలుకి కావలసిన పదార్ధాలు :
పెసరపప్పు  2 గంటలు నానబెట్టాలి      1 కప్ 
ఈ పప్పును గ్రైండర్లో నీరుపోయ్యకుండా రుబ్బి, ఇడ్లి పాత్ర లో ఇడ్లిల వేసి ఆవిరి మీద 20 నిముషాలు ఉడకబెట్టాలి . 
ఇవి ఉడికాక బాగా మెత్తగా నలిపి అందులో పంచదార 1 కప్ వేసి బాగా కలపాలి. లేదా గ్రైండ్ చెయ్యాలి . దీనిలో యాలకుల పొడి వేసి కలిపి , ఉండలు చేసి పక్కన పెట్టాలి. 
నూనె బాగా వేడి చేసి ఈ బూరె ల ఉండాలని తోపు పిండిలో ముంచి, నూనెలో డీప్ ఫ్రై చెయ్యాలి. పెసర లేదా పోలి బూరెలు రెడీ. 
పూర్ణం బూరెలు : కావలసిన పదార్ధాలు :
సెనగపప్పు            1 కప్ 
బెల్లం                        1 కప్ 
సెనగపప్పు ను ఉడకబెట్టి , నీరు తీసి మెత్తగా చేసుకోవాలి. 
బెల్లం పాకం తీసి అందులో సెనగపప్పు పేస్ట్ యాలకులు వేసి దగ్గర పడే వరకు ఉడికించాలి. 
ఇప్పుడు బాగా చల్లార్చి ఉండలు గ చేసి తోపు పిండిలో ముంచి బూరెలు డీప్ ఫ్రై చెయ్యాలి . పూర్ణం బూరెలు రెడీ. 
you tube link        

             Thankyou                
 







Comments

Popular posts from this blog

బెల్లం ఆవకాయ సాంప్రదాయపద్ధతిలో|Bellam Avakaya|Andhra Special sweet mango...

Quick and easy sravanamasa prasadam recipes

శ్రావణ మాసం  ప్రసాదాలు     లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన  పాలతో చేసిన ప్రసాదాలు   శ్రావణమాసం ప్రసాదాలు      శ్రావణ మాసం లో లక్ష్మి దేవి అనుగ్రహం కొరకు పల తో చేసిన ప్రసాదాలు 5 రకాలు. ఇవి ఎలా చెయ్యాలో ఈ వీడియో లో చుడండి  యు ట్యూబ్ లింక్   https://youtu.be/1ll7CwLWq3g

వంకాయ🍆పచ్చడి ఇలా ఒకసారి చెయ్యండి😋| Vankaya Pachadi|kalchina vankaya pach...